8, జనవరి 2016, శుక్రవారం

తెలంగాణ పల్లెలకు “కాకతీయ” తోరణం

Mission-Kakatiyaపోరుబాట వీడి…పొలంబాట పట్టాల్సిన తరుణమిది..బోర్ల ఎవుసం వీడి…చెరువుల నీళ్ళ సేద్యం చేయాల్సిన సమయమిది. సమస్త కోటి మనుగడకు కావాల్సిన మౌలిక అవసరం ఆహారం, కానీ ఆ ఆహారాన్ని పండించడానికి కావల్సింది నీరు. వ్యవసాయసాగుకు ఈ నీరు బావులద్వారా, చెరువుల ద్వారా, కాలువల ద్వారా అందుతుంది. ఉమ్మడి రాష్ట్రంలో అతలాకుతలమైన చెరువుల వ్యవస్థ, నదీజలాల వ్యవస్థల ద్వారా తెలంగాణలో అతి తక్కువశాతం మాత్రమే సాగవు తుంది. ప్రస్తుతం తెలంగాణలో 81.05% సాగునీరు బావులద్వారానే అందుతుంది. చెరువుల ద్వారా కేవలం ఆరుశాతం మాత్రమే సాగవుతుంది. బృహత్ శిలాయుగం నుంచే మన పూర్వీకులు చెరువులను నిర్మించి, నీటిని నిల్వ చేసారనడానికి ఆధారాలెన్నో ఉన్నాయి. ఇంతటి చరిత్ర కలిగినవి కాబట్టే తెలంగాణ ప్రజల సంస్కృతి, జీవన విధానంలో చెరువులు భాగమయ్యాయి.
చెరువులు-తెలంగాణ సంస్కృతి
తెలంగాణను పాలించిన కాకతీయులు, కుతుబ్ షాహీలు, అసఫ్‌జాహీలు దూరదృష్టితో నిర్మించిన చెరువులు తెలంగాణ ప్రజల సంస్కృతిలో, జీవన విధానంలో భాగమయ్యాయి. చెరువులకు, తెలంగాణ ప్రజలకు ఉన్న మైత్రిని చూస్తే తెలంగాణ మహోన్నతమైన సంస్కృతి ప్రతిబింబిస్తుంది. చెరువులను పూర్వం రాజులు, సైన్యాధ్యక్షులు, నాయకులు నిర్మించేవారు. ఇలా నిర్మించిన వారిని కథలద్వారాగాని, దేవాలయాల వద్దగానీ, పండగల సందర్భంలో గానీ ఆ గ్రామప్రజలు స్మరించు కుంటారు. సహాయం చేసిన వారిని ఎప్పటికి గుర్తుంచుకునే తెలంగాణ ప్రజల హృద్రత్వం దీంట్లో కనిపిస్తుంది. తెలంగాణలో ప్రతి నదిని, నీటి సమూహాన్ని గంగా అని పిలుస్తారు. అలాగే చెరువులను సైతం గంగాదేవిగా భావించి చెరువుకట్టలపై గంగాదేవి, కట్టమైసమ్మలాంటి విగ్రహాలు ప్రతిష్టించి ప్రతి ఏడు పండగలు చేస్తారు. మనకు బతుకుదెరువు చూపి స్తున్న నీటిని దేవతల రూపంలో పూజించడం మన ఉన్నత సంస్కృతికి అద్దంపట్టే చక్కని ఉదాహరణ.
తెలంగాణ సంస్కృతిని చాటిచెప్పే బతుకమ్మ పండగకు చెరువులకు అవినాభావ సంబంధం ఉంది. బతుకమ్మ పండగరోజు చెరువు దగ్గర జాతరలా ఉంటుంది. బతుకమ్మలో వాడే పూలు చెరువునీటిని శుభ్రపరిచేందుకు ఉపయోగపడతాయి. అంతే కాకుండా బతుకమ్మ కథలలో ఉన్న ఒక కథనం ప్రకారం చెరువుతెగడం వల్ల వస్తున్న నీటి ప్రవాహాన్ని ఆపి గ్రామాన్ని కాపాడడానికి తన ప్రాణాలు త్యాగం చేసిన వీరవనితే బతుకమ్మ. కాబట్టి అలా గ్రామాన్ని కాపాడిన బతుకమ్మను యేటా స్మరించుకోవడం మన సంస్కృతిలోని గొప్పదనం. గ్రామంలోని చెరువు ప్రతి ఇంటికి అవసరమే. కాబట్టి గ్రామప్రజలు అందరూ కలసికట్టుగా చెరువు ను కాపాడుకుంటారు. ధనిక, పేద, కుల, మత భేదాలు లేకుండా శ్రమదానం చేసి చెరువును సంరక్షి స్తారు. తెలంగాణ పల్లెల్లో ప్రజల్లోని సంబంధాలు భారతదేశ విశిష్ట లక్షణమైన భిన్నత్వంలో ఏకత్వా నికి చక్కని ఉదాహరణ. అంతేకాకుండా చెరువులు మత్సకారులు, గీతకార్మికుల జీవన విధానానికి ప్రతీక. చెరువులలో పెంచే చేపల అమ్మకంద్వారా మత్సకారులు జీవనం గడుపుతున్నారు. తమ బతుకుల్లో వెలుగులు నింపే ఆ చెరువులను గంగాదేవిగా భావించి ఆ గంగాదేవి పుత్రులుగా, గంగపుత్రులుగా వారిని పిల్చుకుంటు న్నారు. తమకు పట్టెడన్నం పెట్టే తమ కులవృత్తిని దానికి ఆధారమైన చెరువును దేవతగా, వారి తల్లిగా భావిస్తున్నారు. ఇలా మన సంస్కృతిలో, మన జీవన విధానంలో మిళితమైన చెరువులు ఉన్నతమైన మన సంస్కృతిని మహోన్నతంగా తీర్చిదిద్దాయి.
సకల ప్రాణులకు ఆధారం చెరువులే 
“చెరువు కింద ఎవుసం చేసి చెడినోడు లేడు”అనేది తెలంగాణలో నానుడి. దీనిని బట్టే వ్యవసాయానికి చెరువు ఎంతలా ఉపయోగపడు తుందో తెలుస్తుంది.
చెరువుల వల్ల కలిగే లాభాలను ఒకసారి పరిశీలిస్తే…
గ్రామంలోని చాలా పొలాలకు సాగునీరు అందిస్తాయి చెరువులు. నీరు నిల్వ ఉంచడం వల్ల గ్రామంలో భూగర్భజలాలు పెరుగుతాయి.
ప్రతి సంవత్సరం పూడిక తీసిన మట్టి, పొలాల్లో ఎరువుగా వేయడం ద్వారా భూములు సారవంతం అయ్యి దిగుబడి పెరు గుతుంది. ప్రస్తుతం సేంద్రీయ ఎరువుల వాడకంలో భాగం గారైతులు పశువుల పేడ కు ట్రాక్టర్‌కు రూ.700 నుండి రూ.800 వరకు చెల్లిస్తున్నారు. కాని పూడిక మట్టి కేవలం రూ.200 నుండి రూ.300లలో లభిస్తుంది.
చెరువుల వల్ల మౌలికమైన ఉపయోగం నీటి ప్రవాహాన్ని అదుపుచేయడం, భూమికోతను నివారించడం.
కరువు సమయాల్లో కూడా లోతట్టు ప్రాంతా లకు సాగునీరు అందిస్తుంది. ప్రజల నీటి అవసరాలను, పశువుల దాహార్తిని తీరుస్తుంది.
మత్సకారులకు, గీతకార్మికులకు జీవనోపాధి కల్పిస్తుంది.
ఇన్ని లాభాలున్న చెరువులు గత పాలకుల అలసత్వం వల్ల నిర్లక్షం చేయబడి తమ వైభవాన్ని కోల్పోయాయి. చెరువుగట్టులు ఎక్కడికక్కడ తెగిపోయి, పూడిక తీయకపోవడం, మరమ్మత్తులు చేయకపోవడంవల్ల నీరు నిలవ చేసుకునే సామర్థం తగ్గిపోయి వాటి వాడకం క్రమంగా తగ్గిపోయింది. నాయకుల అలసత్వం వల్ల క్రమేణా ప్రజలు కూడా చెరువుల యొక్క శిఖం భూముల్ని వ్యవసాయానికి, ఇండ్లు కట్టడానికి వాడుకున్నారు. దీనివల్ల తక్కువ వర్షపాతం కలిగినటువంటి రెయిన్‌షాడో ప్రాంతంలో ఉన్న తెలంగాణ గొంతు ఎండింది, భూగర్భ జలాలు అడుగంటాయి, సాగునీరు కు బోరుబావులే దిక్కయ్యి, పేదరైతులు బోర్లు తవ్వించే స్థోమత లేక రైతుకూలీలుగా మారిన పరిస్థితి. గీతకార్మికులు, మత్సకారులు కులవృత్తిని, జీవనోపాధిని కోల్పోయి గల్ఫ్ దేశాల్లో కార్మికులుగా నరకయాతన అనుభవిస్తున్నారు.
కృత్రిమ ఎరువుల వాడకం పెరిగి భూసారం తగ్గిపోయి దిగుబడులు తగ్గిపోయాయి. దీంతో గిట్టుబాటు ధరలు లభించక రైతుల ఆత్మహత్యలకు దారితీసాయి. మన రాష్ట్ర పండుగ అయిన బతుకమ్మకు తాత్కాలిక కుండీలు ఏర్పాటు చేసి నిమజ్జనం చేసుకునే దుస్థితి నెలకొంది.
మిషన్ కాకతీయతో మెరుగైన జీవితం 
కాకతీయుల కాలంనాటి గత రెండు మూడు దశాబ్దాల క్రితం వరకు ఒక వెలుగు వెలిగిన చెరువులను పునరుద్ధరించడానికి కెసిఆర్ నాయ కత్వంలోని తొలి తెలంగాణ ప్రభుత్వం అధికారం చేపట్టిన కొద్ది రోజులకే “మిషన్ కాకతీయ”పేరుతో మహోన్నత కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. వెలవెల బోతున్న చెరువు గట్టులను మళ్ళీ సాంస్కృతి క వారధులుగా తీర్చిదిద్దేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నారు. ఈ పథకంలో భాగంగా తెలంగాణలో ఉన్న 46,531 చెరువులను 5 దశలుగా 5 సంవత్సరాల్లో పునరుద్ధరించనున్నారు. దీనిలో భాగంగా చెరువుల పూడిక తీయడం, తూములను బాగుపర్చడం, చెరువు గట్టులను మరమ్మత్తుచేయడం లాంటివి చేసి గొలుసుకట్టు చెరువులను పునరుద్ధ రిస్తారు. అంతేకాకుండా పూడిక తీసిన మట్టిన రైతులు ఎలాంటి రుసుం చెల్లించకుండా తీసుకెళ్ళ వచ్చు. దీనివల్ల భూసారం పెరిగి, దిగుబడులు పెరుగుతాయి.
చేయిచేయి కలుపుదాం
చెరువులను పునరుద్ధరించాలన్న ప్రభుత్వ సంకల్పం గొప్పది. దీనికి ప్రజలందరు తమవంతు బాధ్యత నెరవేర్చాలి. “మన ఊరు – మన భవిష్యత్‌” అనే మిషన్ కాకతీయ శీర్షికలో మన తెలంగాణ ప్రజల భవిష్యత్తు కనబడుతుంది. కాబట్టి ప్రజలందరూ పనులలో చేయి చేయి కలిపి ఒక ఉద్యమంలా దీనిని పూర్తి చేసి తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలో అత్యుత్తమంగా తీర్చిదిద్దేలా కృషిచేయాలి. కృత్రిమ ఎరువుల వాడకం వల్ల చెరువులు కలుషితం అయ్యి నీరు వినియోగానికి పనికి రాకుం డా పోతుంది. అందుకే సేంద్రీయ ఎరువుల వాడకం పెంచి మన చెరువులను, భూగర్భ జలాలను సంరక్షించు కోవాలి. మనకోసం, మన భావితరాల కోసం చెరువులను, వాటిలో దాగి ఉన్న మన సంస్కృతిని కాపాడాలి. వాటర్ మ్యాన్ రాజేందర్‌సింగ్ లాంటి వాళ్ళు ఈ పథకాన్ని గొప్పగా అభివర్ణిస్తున్నారు. రాజేందర్ సింగ్ స్వయంగా వరంగల్‌జిల్లాలోని చెరువు గట్టుపై తన జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. ఇంతటి అద్భుత పథకం ఈ మధ్యే మొదటిదశ పనులను దిగ్విజయంగా పూర్తిచేసుకుని రెండవ దశలో మరో పదివేల చెరువుల పునరుద్ధరణకై పరుగులు తీస్తుంది. ఈ దశ కూడా దిగ్విజయంగా పూర్తికావాలని కోరుకుందాం. 


13, ఆగస్టు 2013, మంగళవారం

ఇదీ ఫజల్ అలీ గుర్తించిన తెలంగాణ రాష్ట్రం


తొలి ఎస్సార్సీయే గుర్తించాక.. మళ్లీ తెలంగాణపై ఎస్సార్సీ ఎందుకు?
హైదరాబాద్, ఆగస్టు 12 (టీ మీడియా): మీరు చూస్తున్నది 1954లో రాష్ట్రాల పునర్విభజన సిఫారసులు చేసిన ఫజల్ అలీ కమిషన్ రూపొందించిన మ్యాప్. అప్పట్లోనే హైదరాబాద్ స్టేట్‌గా మనుగడలో ఉన్న తెలంగాణ ప్రాంతాన్ని ఒక ప్రత్యేక రాష్ట్రంగా కొనసాగించాలని పేర్కొంటూ ఫజల్ అలీ ఈ అరుదైన మ్యాప్‌లో పొందుపర్చారు.
telangana
తెలంగాణ సామాజిక, ఆర్థిక, భౌగోళిక నేపథ్యాలను పరిగణనలోకి తీసుకున్న ఎస్సార్సీ.. ఈ ప్రాంతాన్ని హైదరాబాద్ స్టేట్‌గా కొనసాగించాలని ప్రతిపాదించింది. అంటే 1954లోనే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడాల్సింది. కానీ.. ఆంధ్రా నేతల లాబీయింగ్ ఫలితంగా ఆనాటి మన రాష్ట్రం ప్రత్యేక రాష్ట్రంగా కొనసాగలేక పోయింది. ఇప్పుడు దశాబ్దాల ఉద్యమాల అనంతరం, వేల బలిదానాల తర్వాత ప్రజల మనోభీష్టం నెరవేరుతున్నది. కానీ.. ఈ దశలోనూ తెలంగాణకు అడ్డంపడుతున్నవారు.. రెండో ఎస్సార్సీ వేస్తే తప్ప తెలంగాణ అంశాన్ని పరిష్కరించడం సాధ్యం కాదని వాదిస్తున్నవారు.. తొలి ఎస్సార్సీలోనే తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా గుర్తించిన ఫజల్ అలీ సిఫారసును ఎందుకు పట్టించుకోవడం లేదని తెలంగాణవాదులు నిలదీస్తున్నారు. తొలి ఎస్సార్సీలోనే తెలంగాణను గుర్తించగా.. ఇంకా రెండో ఎస్సార్సీ ఆవశ్యకత ఏమిటని ప్రశ్నిస్తున్నారు.

9, ఆగస్టు 2013, శుక్రవారం

పచ్చి అసత్యాలు -సీఎం ప్రెస్‌మీట్‌పై కేసీఆర్ కౌంటర్

పచ్చి అసత్యాలు
-సీఎం ప్రెస్‌మీట్‌పై కేసీఆర్ కౌంటర్
-సర్‌ప్లస్ పవర్ స్టేట్‌గా తెలంగాణను నిర్మించుకుంటాం
-28 రాష్ట్రాలకు వర్తించిన నియమాలే 29వ రాష్ట్రానికి వర్తిస్తాయి


హైదరాబాద్ : సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి గురువారం విలేకర్ల సమావేశంలో లేవనెత్తిన అంశాలపై టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ కౌంటర్ ఇచ్చారు. సమైక్య అక్కసుతో సీఎం కిరణ్ కుమార్‌రెడ్డి పచ్చి అసత్యాలు మాట్లాడుతున్నారని, సీఎం మాటలు తెలంగాణ ప్రజలను బయాందోళనకు గురిచేయడమే కాకుండా సీమాంధ్ర ప్రజలను రెచ్చగొట్టేవిధంగా ఉన్నాయని మండిపడ్డారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటూ కనీసం జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారని, నిన్న సీఎం మాట్లాడిన విషయాల్లో ఒక్కటి కూడా నిజం కాదని, దీనిపై బహిరంగ చర్చకైనా సిద్ధమని కేసీఆర్ సవాల్ విసిరారు. సమైక్యత కోసం సంతకం చేసిన కిరణ్‌కుమార్‌రెడ్డి ఏ అర్హతతో ఈ రాష్ట్రానికి సీఎంగా కొనసాగుతారని నిలదీశారు. నిన్నటి ప్రెస్‌మీట్‌లో కిరణ్ లేవనెత్తిన ప్రతి అంశంపై కేసీఆర్ వివరణ ఇచ్చారు. తెలంగాణలో కేవలం 41 మెగావాట్ల విద్యుత్ లోటు మాత్రమే ఉందని, తెలంగాణ ఏర్పాటైన తర్వాత సర్‌ప్లస్ పవర్ స్టేట్‌గా నిర్మించుకుంటామని కేసీఆర్ చెప్పారు. ఇక నీటి విషయంలో దేశంలో 28 రాష్ట్రాలకు వర్తించే నియమాలే 29వ రాష్ట్రంగా ఏర్పడే తెలంగాణకూ వర్తిస్తాయని, పాకిస్తాన్ వంటి దేశంతోనే ఐదు నదుల నీటిని పంచుకుంటున్నామని రెండు రాష్ట్రాలుగా విడిపోతే నీటి సమస్యలొస్తాయనటం అవివేకమన్నారు. నిన్నటి ప్రెస్‌మీట్‌లో సీఎం లేవనెత్తిన ప్రతి అంశంపై కూలంకుశంగా కేసీఆర్ వివరణ ఇచ్చారు.

విద్యుత్ లెక్కలు పచ్చి అసత్యాలు
హైదరాబాద్ : ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే తెలంగాణలో విద్యుత్ కొరత ఏర్పడుతుందని సీఎం చేసిన వ్యాఖ్యలకు కేసీఆర్ సమాధానం ఇచ్చారు. తెలంగాణలో ఉత్పత్తి అయ్యే కరెంట్ పోను 418 మెగావాట్ల విద్యుత్ లోటు ఉందని తెలిపారు. తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 4825 మెగావాట్లు అని పేర్కొన్నారు. థర్మల్ పవర్ నుంచి విద్యుత్ ఉత్పత్తి 2282 మెగావాట్లు, హైడల్ పవర్ నుంచి 543 మెగావాట్లు ఉత్పత్తి అవుతుందని చెప్పారు. ఏడాది మొత్తం తెలంగాణకు హైడల్ పవర్ కెపాసిటీ 800 మెగావాట్లు అని తెలిపారు. తెలంగాణకు 2458 మెగావాట్ల విద్యుత్ కొరత ఉందని, తెలంగాణకు మొత్తం అవసరమైన విద్యుత్ 6848 మెగావాట్లు అని చెప్పారు. కేంద్రం దగ్గర 200 మెగావాట్ల విద్యుత్ ఉంటుందని పేర్కొన్నారు.నిన్న సీఎం ప్రెస్‌మీట్ తర్వాత ఛత్తీస్‌గఢ్ సీఎంతో తాను స్వయంగా మాట్లాడానని కేసీఆర్ తెలిపారు. రెండున్నర నెలల్లో ఛత్తీస్‌గఢ్ నుంచి తెలంగాణకు గ్రిడ్ కనెక్టీవిటీ ఏర్పాటు చేయొచ్చు అని పేర్కొన్నారు. ఛత్తీస్‌గఢ్ నుంచి 1000 నుంచి 1500 మెగావాట్ల విద్యుత్‌ను కొనుగోలు చేసుకుంటామని చెప్పారు. గోదావరికి అవతలికి ఇవతలికి లైన్ వేసుకుంటే 600 మెగావాట్లు విద్యుత్ వస్తుందని తెలిపారు. తెలంగాణలో అదనంగా 10 వేల మెగావాట్ల విద్యుత్‌ను అదనంగా ఉత్పత్తి చేసుకుంటామని చెప్పారు. ఇంకా మిగులు విద్యుత్ ఉండేలా చూసుకుంటామని చెప్పారు. తెలంగాణలో 6,620 మెగావాట్ల కరెంట్ ఉత్పత్తి చేయడానికి ప్రోగ్రామ్డ్ ప్రాజెక్టులున్నాయని పేర్కొన్నారు. చెన్నూరులో వదిలేసిన బొగ్గు గనులను రీ - ఒపెన్ చేస్తామన్నారు. మరో 3-4 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే ప్లాంట్స్ ఏర్పాటు చేసుకోవచ్చు అని తెలిపారు. కేటీపీఎస్‌లో మరో 800 మెగావాట్లు, భూపాలపల్లిలో మరో 800 మెగావాట్లు, సత్తుపల్లిలో 600 మెగావాట్లు, రామగుండంలో 1320 మెగావాట్లు ఉత్పత్తి చేసుకుంటామని పేర్కొన్నారు.రాష్ట్రం విడిపోతే ఆంధ్రకు 300 మెగావాట్లకు పై చిలుకు మిగులు విద్యుత్ ఉంటుందని చెప్పారు. ఒరిస్సా నవ్‌గావ్‌సలేలో 2500 మెగావాట్ల విద్యుత్‌ను రాష్ట్రానికి కేంద్రం కేటాయించిందని గుర్తు చేశారు. దాని గురించి ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరెంట్ సమస్య మీద తాము నిపుణులను తీసుకొస్తం.. మీరు నిపుణులను తీసుకురండి.. బహిరంగ చర్చకు సిద్ధమని కేసీఆర్ సవాల్ విసిరారు.మద్రాస్ నుంచి ఆంధ్ర విడిపోయినప్పుడు విద్యుత్ ఎంత అని ప్రశ్నించారు. తమ కంటే 90 శాతం వరస్ట్ రేంజ్‌లో ఉన్నారు అని గుర్తు చేశారు.


న్యాయసూత్రాల ప్రకారమే నీటి పంపకం
హైదరాబాద్ : నీటి పంపకాల విషయంలో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి లేనిపోని అపోహాలు సృష్టిస్తున్నారని, మిడిమిడి జ్ఞానంతో తెలిసి తెలియక మాట్లాడటం చాలా బాధాకరమని కేసీఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే అంతర్జాతీయ న్యాయసూత్రాల ప్రకారమే నీటి పంపకం జరుగుతుందని తెలిపారు. నదులను దేశాలే పంచుకున్నప్పుడు తెలంగాణ, సీమాంధ్ర పంచుకోలేవా అని ప్రశ్నించారు. నీటి పంపకం విషయంలో అపోహాలు సృష్టించి భవిష్యత్ తరాల్లో విషబీజాలు నాటొద్దు అని విజ్ఞఫ్తి చేశారు.సీఎం ఎకరువు పెట్టుకుంటూ సముద్రంలోకి 3 వేల క్యూసెక్కులుగా నీరు వృథాగా పోతున్నదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారే.. పాలకులుగా ఆయన ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. తెలంగాణలో ప్రాజెక్టులు పూర్తి చేయకపోవడం వల్లే సముద్రంలోకి నీళ్లు పోతున్నాయని స్పష్టం చేశారు. 57 ఏళ్ల తరువాత సీమాంధ్రులకు ఇవన్నీ గుర్తొస్తున్నాయా అని అడిగారు. 14 టీఎంసీల నీటి సామర్థ్యం ఉన్న చిన్న చిన్న ప్రాజెక్టులు 16 లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తాయా అని ప్రశ్నించారు. మీ ప్రాజెక్టులను తాము నమ్మలా అని అడిగారు. ప్రాణహిత, చేవెళ్లతో 16 లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తామంటున్నారు.. దానికి కేటాయించింది మాత్రం 14 టీఎంసీల నీళ్లు.. ఇలా పొంతన లేకుండా సీఎం చెప్పడం సబబు కాదన్నారు.14 టీఎంసీలతో 16 లక్షల ఎకరాలకు నీళ్లందించడం సాధ్యమా అని ప్రశ్నించారు. రేపు తెలంగాణ రాష్ట్రంలో గోదావరి మీద ఒక జాతీయ ప్రాజెక్టు, కృష్ణా మీద ఒక జాతీయ ప్రాజెక్టు కడుతామని తెలిపారు. నీళ్ల పంపకం విషయంలో 2 రాష్ట్రాలకు ఏ నియమాలున్నాయో... 29వ రాష్ట్రమైనతెలంగాణకు అవే నియమాలు ఉంటాయని చెప్పారు. ఐదు నదులను పాకిస్తాన్‌ను పంచుకుంటున్నానయని గుర్తు చేశారు. ఇతర దేశాలతోనే మన దేశం నీటిని పంచుకుంటున్నప్పుడు తెలంగాణ, సీమాంధ్ర నీటిని పంచుకోవడానికి అభ్యంతరాలు ఎక్కడ ఉంటాయని అడిగారు.

హైదరాబాద్ లో సీమాంధ్ర అడ్వకేట్ల సంఖ్యపై చర్చకు సిద్ధం
హైదరాబాద్ : హైదరాబాద్‌లో ఉండేది 10 నుంచి 15 వేల మంది అడ్వకేట్లు మాత్రమే అని కేసీఆర్ తెలిపారు. అడ్వకేట్ల మీద ఎలాంటి చర్చకైనా సిద్ధమేని చెప్పారు. ఇక్కడ 1919లో నిజాంకాలంలో హైకోర్టు ఏర్పడద్దని గుర్తు చేశారు. మీకు 1954లో గుంటూరులో హైకోర్టు ఏర్పడద్దని తెలిపారు. హైదరాబాద్ హైకోర్టులో ఆంధ్ర అడ్వకేట్లు ఉన్నది 3 వేల నుంచి 4 వేలు మాత్రమే అని తెలిపారు. కిరణ్‌కు జ్ఞానం లేక తాను మాట్లాడింది హాస్యాస్పదం అంటారు.. కావాలంటే హైకోర్టుకు సంబంధించిన వివరాలను పూర్తిగా సీఎంకు ఇవ్వడానికి సిద్ధమని కేసీఆర్ పేర్కొన్నారు. కిరణ్ ఎవరిని భయపెట్టడానికి అబద్ధాలు చెబుతున్నారని ప్రశ్నించారు.

ఉద్యోగుల విషయంలో కాకిలెక్కలే
తెలంగాణ వాళ్లకు దక్కాల్సిన ఉద్యోగాల్లో సీమాంధ్ర ప్రాంతం వాళ్లు అక్రమంగా వచ్చారని తాము పోరాటం చేశామని కేసీఆర్ తెలిపారు. ఇవాళ ఆయన తెలంగాణ భవన్‌లో సీఎం కిరణ్ కుమార్‌రెడ్డి చేసిన వ్యాఖ్యాలపై మీడియాతో మాట్లాడారు. 610 జీవో ప్రకారం 58,956 మంది ప్రాంతేతర ఉద్యోగులు ఉన్నారని కేసీఆర్ వివరించారు. గిర్లిగాని కమిటీ, 610 జీవోలు చూడకుండానే వెళ్లి పోవాల్సిన ఉద్యోగులు పద్దెనిమిది వేల మంది ఉద్యోగులేనని కాకి లెక్కలు చెబుతున్నారని అన్నారు. 83 వేల మంది ఉద్యోగులను తరలించమని జీవోలు జారీ చేసింది ఆంధ్ర సీఎంలే కదా అని కేసీఆర్ ప్రశ్నించారు. సకల జనుల సమ్మె కాలంలో ఎనబై ఆరు శాతం మంది ఉద్యోగులు హాజరయ్యారని సీమాంధ్ర మీడియానే కదా రాసింది అని ఆయన గుర్తు చేశారు. మొన్న తెలంగాణ ఏర్పాటును సీడబ్ల్యూసీ ప్రకటించిన తర్వాత ‘మేం పోనేపోం అంటూ రోడ్లపైకి వచ్చిన వేలాది మంది ఉద్యోగులు ఎక్కడి వాళ్లు’ అని కేసీఆర్ ప్రశ్నించారు. ఉద్యోగుల విషయంలో తెలంగాణ వాళ్లకు అన్యాయం జరిగింది నిజంకాదా అని నిలదీశారు. తెలంగాణ ఫేర్ షేర్ ఎక్కడాలేదని, అంతా 4-6 శాతమేనని ఆవేదనతో అన్నారు. అన్ని హెచ్‌ఓడీల్లో ఆంధ్రోళ్లే తిష్ట వేశారని విమర్శించారు.

ఎవరినీ నేను వెళ్లిపొమ్మనలేదు
తెలంగాణ ప్రాంతంలో అక్రమంగా, రాజ్యాంగ విరుద్ధంగా ఉద్యోగాలు చేస్తున్న సీమాంధ్ర వాసులను తాను వెళ్లిపోమని అనలేదని టీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. తెలంగాణ ఏర్పడితే ఈ ప్రాంత ఉద్యోగులు ఇక్కడి సెక్రటేరియట్‌లో పనిచేస్తారని, సీమాంధ్ర ప్రాంతానికి చెందిన వాళ్లు సీమాంధ్ర సెక్రటేరియట్‌లో పనిచేస్తారని మాత్రమే తాను అన్నానని పేర్కొన్నారు. అసలు వెళ్లండి అనే మాటను తాను ఉచ్చరించలేదని స్పష్టం చేశారు. అయినా ఆంధ్ర ప్రాంత ఉద్యోగులు ఎక్కడ పనిచేయాలో ఆంధ్రా సర్కారు నిర్ణయిస్తుందని తెలిపారు. అసలు మీ ప్రాంత ఉద్యోగుల మా వద్ద పనిచేస్తే మా సర్కార్‌కే కదా టాక్స్ వస్తుందని ఆయన వివరించారు. అలాంటప్పుడు మేమెందుకు పొమ్మంటామని అన్నారు.

సీఎం కిరణ్‌వి పసలేని వాదనలు 
హైదరాబాద్ : రాష్ట్రాన్ని విభజించొద్దని సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ తీవ్రంగా స్పందించారు. సీఎం అర్థం లేని, పసలేని వాదనలు చేసిండు అని ధ్వజమెత్తారు. కిరణ్ మెంటల్ స్టేటస్ సరిగా లేక హైదరాబాద్ స్టేటస్ మీద ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రా వాళ్లు వేరే వాళ్లు అని తాము ఏనాడూ అనలేదని స్పష్టం చేశారు. తెలంగాణలో పుట్టినోళ్లంతా తెలంగాణ బిడ్డలే అని పేర్కొన్నారు. కిరణ్ కూడా ఇక్కడే ఉండొచ్చు.. కర్రీ పాయింట్, టిఫిన్ సెంటర్ పెట్టుకోవచ్చు అని సూచించారు.

కలిసుంటే తెలంగాణకు ఒక్క లాభం చెప్పవు
ఆంధ్రప్రదేశ్ విడిపోతే సీమాంధ్ర నష్టపోతుందని సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి అనడాన్ని కేసీఆర్ తప్పుబట్టారు. విడిపోతే నష్టాల గురించి సీఎం చెబుతున్నాడుగానీ, కలిసుంటే తెలంగాణకు వచ్చే లాభాలేంటని కేసీఆర్ ప్రశ్నించారు. ఉద్యమాలతో రాష్ట్రాలు ఏర్పడవనే కిరణ్ వాళ్ల పొట్టి శ్రీరాములు మద్రాసు రాష్ట్రం నుంచి ఆంధ్ర రాష్ట్రం విడిపోవడానికి ఎంత త్యాగం చేశాడో గుర్తించాలని కేసీఆర్ సూచించారు. ఉద్యమాల ద్వారా రాష్ట్రాలు ఏర్పడవని సీఎం కిరణ్ కుమార్‌రెడ్డి అనడం పొట్టి శ్రీరాములును అవమానించడమేనని తెలిపారు. మద్రాసు రాష్ట్రం నుంచి ఆంధ్రులు విడిపోయేటపుడు తమిళులను ఎన్ని మాటలనలేదని ప్రశ్నించారు. అప్పటి మద్రాసు సీఎం రాజాజీని నామాల నల్లకాకి అని తిట్లలేదా అని అన్నారు.

ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదనడం తప్పు
తెలంగాణ ఏర్పాటు పార్టీపరంగానే జరిగిందని, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంకాదని సీఎం కిరణ్ వ్యాఖ్యానించడంపై కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరోజు సీడబ్ల్యూసీతోపాటు యూపీఏ సమన్వయ కమిటీలో కూడా చర్చించాకే తెలంగాణ ప్రకటన వచ్చిందని కేసీఆర్ తెలిపారు. యూపీఏ సమన్వయ కమిటీలో ప్రభుత్వం తరపున ప్రధాని పాల్గొనలేదా అని ప్రశ్నించారు. సీఎం అవగాహన లేకుండా మాట్లాడటం తగదని అన్నారు.

ఏ అర్హతతో సీఎంగా ఉన్నావు
సమైక్యాంధ్ర నేతలు రూపొందించిన సమైక్య నోట్‌పై సీఎం కిరణ్ కుమార్‌రెడ్డి సంతకం చేయడాన్ని కేసీఆర్ తప్పుబట్టారు. సమైక్య నోట్‌పై సంతకం చేసి కాంగ్రెస్ అధిష్ఠానానికి పంపించిన సీఎం ఏ అర్హతతో తెలంగాణ ప్రాంతానికి సీఎంగా వ్యవహరిస్తున్నాడని ప్రశ్నించాడు. ఈ ప్రాంత ప్రజల మనోభావాలను పరిగణలోకి తీసుకోకుండానే ఎలా సంతకం చేశారని నిలదీశారు. సీమాంధ్ర నేతలు స్వార్థంతో కలిసుందామని అంటే సీఎం కిరణ్ వారికి వంత పాడుతున్నాడని విమర్శించారు.

5, ఆగస్టు 2013, సోమవారం

మన బొట్టు మన బోనం

మన బొట్టు మన బోనం
ఆషాఢం పూర్తయి, శ్రావణంలోకి అడుగిడుతున్న వేళ మన ఘనమైన బోనాల జాతర వైభవం ముగింపునకు చేరుకుంటున్నది. 
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పట్టే బోనాల పండగ అనగానే మనకు గుర్తొచ్చేది లాల్ దర్వాజ వేడుక. లాల్ దర్వాజ సింహవాహిని శ్రీమహంకాళీ దేవాలయం. వందేళ్లకు పైగా ఘన చరిత్ర గలదీ ఆలయం. గోల్కొండ కోటలోని మైసమ్మ మాదిరిగానే సికింవూదాబాద్‌లోని శ్రీ ఉజ్జయినీ మహంకాళి, జూబ్లీహిల్స్‌లోని పెద్దమ్మ దేవాలయాలూ బోనాల వేడుకలకు పేరెన్నిక గన్నాయి.


bottubonamఅలాగే, కార్వాన్ దర్బార్ మైసమ్మ, మీరాలమండిలోని శ్రీ మహంకాళీ దేవాలయం, అక్కన్న మాదన్న మహంకాళీ ఆలయం, చార్మినార్‌వద్ద గల భాగ్యలక్ష్మి ఆలయం, ఉప్పుగూడలోని మహంకాళీ గుడి, లోయర్ ట్యాంక్ బండ్‌లోని కనకాల కట్టమైసమ్మ గుడి, బేగంపేటలోని శ్రీ కట్టమైసమ్మ ఆలయం, గౌలిపుర ద్వారం వద్ద గల మహంకాళీ మాతేశ్వరి వంటివి మొత్తం 100కు పైగా అమ్మవార్ల ఆలయాలు జంటనగరాలలో కొలువుదీరి ఉన్నాయి. ఈ బోనాల వేళ ప్రతీ ఒక్క గుడీ శోభాయమానంగా వెలిగిపోతుంది.
ఆనాడు నిజాం నవాబుల హయాంలోని మన హైదరాబాద్ నగరం చుట్టూ ఒక పెద్ద ప్రహరీ గోడ ఉండేది. నగరం లోపలకు వెళ్లడానికి మొత్తం 14 ద్వారాలు ఉండేవి. ఆయా ద్వారాల వద్ద, నగరం లోపల వివిధ ప్రాంతాలలో వెలసిన అమ్మవార్ల గుళ్లు ఎన్నో.
ఇక్కడి హిందూ, ముస్లిం ప్రజల అన్యోన్య సహజీవనానికి గుర్తుగా ఆషాఢమాసంలో వచ్చే బోనాలు, ఇంచుమించు ఇదే సమయంలో నెలవంక దర్శనంతో వచ్చే రంజాన్ ఉపవాస వేడుకలు ఒక ప్రతీకలుగా నిలుస్తున్నాయి. ఈ రెండు పర్వదినాలు కలిసే సమయం చాలా అరుదుగా వస్తుంది. ఈసారి అంటే 33 సంవత్సరాల తర్వాత అటు బోనాలు, ఇటు రంజాన్ రెండు పండగలూ ఒకేసారి కలిసి వచ్చాయి. అందుకే, మన నగరాన్ని ఇప్పుడు ఆధ్యాత్మిక మేఘాలు కమ్ముకున్నాయి.

నిజాం నవాబుల పరిపాలనకు పూర్వం మన ప్రాంతాన్ని ఏలిన కాకతీయులు కూడా పలు రూపాల్లో ఆదిపరాశక్తిని ఆరాధించినట్లు చరిత్ర చెబుతోంది. ప్రతాపరుద్ర చక్రవర్తి ఆషాఢమాసంలో కాకతిదేవికి బలిపూజలు నిర్వహించేవాడని ప్రతీతి. ఈ ఉత్సవం చివరి రోజున అమ్మవారికి రాశులు రాశులుగా బోనాలను సమర్పించుకునే వారనీ చరివూతకారులు చెప్తారు. ఆ సందర్భంలో బోనాల వేడుకకు చిహ్నంగా ప్రజలందరికీ భారీ ఎత్తున అన్నదానం నిర్వహించేవారనీ తెలుస్తోంది.
గత నెల 11న గోల్కొండ వేడుకలతో జంటనగరాలలో అమ్మవారి బోనాలు ప్రారంభమయ్యాయి. దాదాపు నెలరోజులపాటు అంటే ఆషాఢం పొడుగునా ప్రజలు ఈ ఉత్సవాలను ఘనంగా జరుపుకున్నారు. జూలై 28న లష్కర్ (సికింవూదాబాద్) బోనాలు ముగిశాయి. కాగా, గత నెల 26 నుండి లాల్ దర్వాజ ఉత్సవాలు ప్రారంభమైనాయి. ఒక అంచనా మేరకు దాదాపు రెండున్నర నెలల పాటు (ఆషాఢ, శ్రావణ మాసాలలో) ఈ బోనాల భక్తి సందళ్లు నెలకొంటాయి.

ప్రజలంతా ప్రగాఢంగా విశ్వసించే ఈ బోనాల ఉత్సవాలు శక్తి స్వరూపిణి అయిన ఆదిపరా శక్తి అమ్మవారు అవతారాలుగా భావించే వివిధ దేవతల ఆరాధనలో భాగంగానే జరుగుతాయి. యావత్ సృష్టికి తల్లి శక్తిస్వరూపిణి. మానవునికి శక్తినిచ్చేది ఆహారం. అది భోజనాల ద్వారానే మనకు సిద్ధిస్తుంది. అమ్మ భోజన స్వరూపిణి. భోజనం అంటేనే అచ్చ తెలుగులో బోనం అని అర్థం.
కొత్త కుండలో బియ్యం, పసుపు, పాలు, బెల్లం వేసి వండుతారు. ఆ కుండకు సున్నం, జాజుతో పూతలు పూసి, వేపకొమ్మలతో అలంకరిస్తారు. దానిపైన దీపం వెలిగిస్తారు. ఇలా తయారైన బోనాలను నిష్టాగరిష్టులైన మహిళలు భక్తిక్షిశద్ధలతో తలపై పెట్టుకుని అమ్మవారు ఆలయం దాకా మోసుకెళతారు. ఈ బోనాన్ని (నైవేద్యం) అమ్మవారికి సమర్పించి, మొక్కులు తీర్చుకుంటారు. గుడి ముందు పసుపు నీళ్లలో వేపాకును కలిపి సమర్పిస్తారు. మొదట్లో తాటికల్లు సమర్పించుకునే వాళ్లు. కానీ, కాలక్షికమేణా కల్లు స్థానంలో పసుపు నీళ్లు-వేపాకులతో కలిపి సమర్పిస్తున్నారు. అనేక గ్రామాలలో ఇప్పటికీ కల్లునే వినియోగిస్తున్నారు.

బోనాల పండుగ ప్రత్యేక ఆకర్షణ పోతరాజుల వీరంగం. పోతరాజు అంటే ఏడుగురు అక్కల ముద్దుల తమ్ముడు. అమ్మవారిని పొలిమేరల నుంచి గ్రామంలోని దేవాలయానికి తీసుకొచ్చేటప్పుడు, తర్వాత ఆమెను సాగనంపేటప్పుడు రక్షణగా ముందు నడుస్తూ ఉంటాడు. ఏడుగురు అక్కాచెప్లూళ్లయిన అమ్మవార్లకు ఈ పోతరాజు అంటే అమితానందమని పెద్దలు చెప్తారు. పోతరాజు చేత కొరడా దెబ్బలు తింటే దుష్టశక్తులు ఆవహించవని భక్తుల విశ్వాసం.

బోనాల పండగ రోజున అమ్మవారికి ఇష్టమైన పదార్థాలను తమ ఇళ్లలో తయారు చేసుకుని వాటిని బండ్లలో పెట్టుకొని గుడికి తెస్తారు. ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి, వాటిలోని కొంత అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. మిగిలిన వాటిని ఇంటికి తీసుకెళ్లి కుటుంబ సభ్యులంతా మహావూపసాదంగా స్వీకరిస్తారు. ఈ ప్రసాదాలు తెచ్చే బండ్లనే ‘ఫలహారాల బండ్లు’ అంటారు. అలాగే, బోనాల పండగలోని అత్యంత ఆసక్తికరమైన మరో ఘట్టం ‘రంగం’. మాతంగిగా భావించే స్త్రీ ఆ వేళ భవిష్యవాణిని తన నోటి వెంట వినిపిస్తుంది. దీనిపట్ల ప్రజలు ప్రగాఢమైన విశ్వాసం కనబరుస్తారు.
- ఎన్.వనిత విజయకుమార్,
హైదరాబాద్. 92460 62192

నమస్తే తెలంగాణా సౌజన్యంతో 

నవ తెలంగాణ

నవ తెలంగాణ
list
-కల నిజం చేసుకుందామన్న కేసీఆర్

-తెలంగాణ అంశం ఏనుగెల్లింది... తోక చిక్కింది
-తల తెగిపడ్డా హైదరాబాద్ మీద రాజీలేదు
-టీజేఎఫ్ మీట్ ది ప్రెస్‌లో తేల్చిచెప్పిన టీఆర్‌ఎస్ అధినేత
-నీళ్లు.. నిధులు.. నియామకాలు..


కనీవినీ ఎరుగని విధ్వంసానికి గురైన తెలంగాణ పునర్నిర్మాణమే రాష్ట్రం ఏర్పాటు అనంతరం తమ కార్యక్రమంగా ఉంటుందని టీఆర్‌ఎస్ అధినేత కే చంద్రశేఖర రావు ప్రకటించారు. అన్ని వర్గాలవారు గౌరవంగా, కాలర్ ఎగరేసుకునే విధంగా..
narayanaఅన్నార్తులు లేని, అసమానతలు లేని తెలంగాణ సాధనకే ప్రత్యేక రాష్ట్రం కోరుకున్నాం తప్ప స్వార్థ రాజకీయ నాయకులు కడుక్కుని తాగడానికి కాదని ఆయన స్పష్టం చేశారు. హైదరాబాద్ లో ఆదివారం టీజేఎఫ్ నిర్వహించిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు ప్రశ్నలకు ఆయన సమాధానమిస్తూ.. తెలంగాణ పునర్నిర్మాణమంటే కూల్చి కడతారా? అనే వాళ్ల కురుచబుద్ధులు చూస్తే జాలివేస్తుందని అన్నారు. రాష్ట్రం ఏర్పాటయ్యాక విద్యుత్ విషయంలో లోటు భర్తీకి 10 విద్యుత్ కేంద్రాలను ఏర్పాటు చేసి ఐదేళ్లలో 10 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసుకుంటామన్నారు. కాగజ్‌నగర్ నుంచి మణుగూరు వరకు పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు చేసుకుంటామని, దానితో వేలాది ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వస్తాయని చెప్పారు.

ఖాయిలాపడిన పరిశ్రమల పునరుద్ధరణకు.. ముఖ్యంగా బోధన్ షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణకు కృషి జరుపుతామన్నారు. మేలైన పరిపాలనకు 10 జిల్లాలను 24కు పెంచుతామని చెప్పారు. భూపాలపల్లి కేంద్రంగా జయశంకర్ జిల్లా ఏర్పాటు చేస్తామన్నారు. ఆరోగ్యరంగంలో ప్రైవేటు రంగ గుత్తాధిపత్యానికి తెరదించుతూ 24 జిల్లాల్లో నిమ్స్ స్థాయిన కార్పొరేట్ ఆసుపత్రులు ఏర్పాటు చేస్తామన్నారు.మండల, నియోజకవర్గస్థాయి ఆస్పత్రులు ఏర్పా టుచేస్తామని వివరించారు. హైదరాబాద్ అభివృద్ధిపై మాట్లాడుతూ తెలంగాణకు హైదరాబాద్ బ్యాక్‌బోన్‌గా ఉంటుందన్నారు. నగరం చుట్టూ వందకిలోమీటర్ల పరిధిలో శివారు పట్టణాలు ఏర్పాటు చేసి ఒక్కో ప్రాంతాన్ని ఒక్కో హబ్‌గా తీర్చిదిద్దుతామని లైట్ రైల్ విధానంలో కారిడార్లు ఏర్పాటు చేసి రవాణా మెరుగుపరుస్తామన్నారు.

ప్రపంచ సీఈఓల ఆర్గనైజేషన్ హైదరాబాద్ పెట్టుబడులకు ప్రపంచంలోనే రెండవ అత్యంత అనువైన నగరంగా పేర్కొన్నదని గుర్తు చేశారు. హైదరాబాద్ అందర్నీ ఆదరించే నగరమని, వందల ఏళ్లనుంచే తమిళ, బెంగాలీ,మర్వాడీ తదితరులు ఏ సమస్యా లేకుండా నివసిస్తున్నారని, సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ఉద్యోగులు సైతం ఉండవచ్చునని రిటైరై ప్లాట్లు కూడా కట్టుకోవచ్చని అన్నారు. అయితే హైదరాబాద్‌ను కేంద్ర పాలితం గానీ మరొక ఆప్షన్ గానీ తల తెగిపడ్డా అంగీకరించే ప్రశ్నే లేదని స్పష్టం చేశారు. అలాగే ఉద్యోగుల విషయంలో నిబంధనల ప్రకారం ఉంటుందని ఆప్షన్లకు మాత్రం ఒప్పకోమని కుండబద్దలు కొట్టారు. తెలంగాణ సాధన ముఖ్య ఉద్దేశ్యమే ఈ ప్రాంత నియామకాలు ఇక్కడి వారికే కావాలని, ఆ విషయంలో ఎలాంటి రాజీ లేదన్నారు. అలాంటపుడు రాష్ట్రం అవసరమే లేదని చెప్పారు.

నమస్తే తెలంగాణ సౌజన్యంతో 

30, జులై 2013, మంగళవారం

wikipedia updated about telangana state very fastly.....


మాటల్లేవు మాట్లడుకోవదేల్లవు 
తెలంగాణా మనదే హైదరాబాద్ మనదే    ........

జై .......తెలంగాణా ........

60 సంవత్సరాల తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవెరింది...మన 60 యేండ్ల పోరాటానికి ఫలితం దక్కింది ... 10 సంవత్సరాల వరకు హైదరాబాద్ ని ఉమ్మడి రాజధాని గా కేంద్రం ప్రకటించింది .... ఈ విజయం తెలంగాణా అమరవీరులకు అంకితం ..జై .......తెలంగాణా ........ తెలంగాణా రాష్ట్రంలో ఇదే న తొలి పొస్త్....

29, జులై 2013, సోమవారం

తెలంగాణ ఏర్పడితే భూమి బద్దలవుతుందా?

తెలంగాణ ఏర్పడితే భూమి బద్దలవుతుందా? సీమాంధ్ర సగటుపౌరుడు అన్యాయానికి గురవుతాడా? సీమాంధ్రకు నీళ్లు రావా? హైదరాబాద్ స్థాయికి ఎదిగే అవకాశాలు ఉన్న నగరాలు సీమాంధ్రలో లేవా? తెలంగాణ విషయంలో ఏదైనా కదలికలు ఏర్పడితే.. గుప్పెడు మంది సీమాంధ్ర పెట్టుబడిదారులు ఎందుకు వరుసకట్టి తెలంగాణను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారు? నిజాలేంటి.. నిష్టూరాలేంటి? ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించే తెలంగాణ సాధించే అభివృద్ధిని పక్కనపెడితే.. విభజనతో అత్యధిక లబ్ధి పొందేది ‘సీమాంధ్ర ప్రజలే’నన్నది తిరుగులేని వాస్తవం! కొత్త రాజధాని.. దాని నిర్మాణానికి అందే వేల కోట్ల నిధులు.. అంతిమంగా ప్రజల్లోకే ప్రవహిస్తాయి. రాజధాని ఏర్పడే సమీప జిల్లాలేకాకుండా.. ప్రధాన నగరాలుగా రూపుదిద్దుకునే అన్ని ప్రాంతాల్లోనూ భూములకు మహర్దశ పడుతుంది. కొత్తగా హైకోర్టు ఏర్పడుతుంది. ఐటీ పరిశ్రమ ప్రవేశిస్తుంది. ఫలితంగా ఇప్పటికే పెరుగుతున్న రియల్‌ఎస్టేట్ వ్యాపారం మరింత ఊపందుకుంటుంది. విభజన వల్ల ఉద్యోగాలు రెట్టింపు కావడంతో నిరుద్యోగ సమస్య తీరుతుంది. విస్తారమైన తీర రేఖ ఉన్న కోస్తాంధ్రలో నెలకొల్పే థర్మల్ ప్రాజెక్టులతో గుజరాత్‌ను మించిన విద్యుత్ వెలుగులు వికసిస్తాయి. ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు ఏర్పాటై.. దుబాయ్, సింగపూర్ వంటి విదేశీ నగరాలకు కూడా నేరుగా ప్రయాణమార్గం ఏర్పడుతుంది. ఇప్పటికే ధాన్యాగారంగా భాసిల్లుతున్న జిల్లాలు.. సమీకృత కృషితో హరిత విప్లవాలకు నెలవవుతాయి. ఇక నీటిపంపకాల విషయమంటారా? అంతర్జాతీయ న్యాయసూత్రాలు.. జాతీయ ట్రిబ్యునళ్ల ఆదేశాల మేరకే జలాల పంపకం జరుగుతుంది కానీ.. ఎగువ రాష్ట్రం దయాదాక్షిణ్యాలపై కింది రాష్ట్రాలకు నీటి లభ్యత ఉండదన్నది జగమెరిగిన వాస్తవం! వెరసి.. ఈ విభజన వికాసానికే! విడిపోయి కలిసుండే రెండు తెలుగు రాష్ట్రాల ఐక్యత.. రెండు ప్రాంతాల ప్రజల అభివృద్ధికే! రాష్ట్ర విభజన జరిగితే తెలంగాణకే కాదు సీమాంధ్రకూ అనేక లాభాలు.. వాటిని స్థూలంగా మీ ముందుకు తీసుకువచ్చేందుకు చేస్తున్న చిన్న ప్రయత్నం ఇది. విజ్ఞులైన సీమాంధ్రప్రాంత ప్రజలు వీటిని స్వీకరిస్తారని ఆకాంక్షిస్తూ...
- సీఎల్ రాజం, సీఎండీ, నమస్తే తెలంగాణ

తెలంగాణ కల నెరవేరనుంది: అజిత్‌సింగ్(తుది నిర్ణయం రేపే)

తెలంగాణ కల నెరవేరనుంది: అజిత్‌సింగ్
న్యూఢిల్లీ: త్వరలో తెలంగాణ కల సాకారం కానుందని రాష్ట్రీయ లోక్‌దళ్ అధినేత, కేంద్రమంత్రి చౌదరి అజిత్‌సింగ్ అన్నారు. ఇవాళ ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ప్రజల సుధీర్ఘ పోరాటానికి ఫలితం దక్కనుందని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటిస్తుందని తాను అనుకుంటున్నానని ఆయన తెలిపారు.

తుది నిర్ణయం రేపే ప్రకటిస్తం : దిగ్విజయ్
న్యూఢిల్లీ: తెలంగాణపై రేపు తుది నిర్ణయం ప్రకటిస్తామని కేంద్రమంత్రి, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జీ దిగ్విజయ్‌సింగ్ స్ఫష్టం చేశారు. ఇవాళ ఆయన ఓ జాతీయ మీడియా ఛానల్ ఎన్డీటీవీతో మాట్లాడారు. తెలంగాణపై ఇప్పటికే పలుమార్లు చర్చలు, సంప్రదింపులు జరిపి ఒక నిర్ణయం తీసుకున్నామని ఆయన అన్నారు. ఆ నిర్ణయానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంటుందని ఆయన వెల్లడించారు. అసెంబ్లీలో తీర్మాణం కూడా అవసరం లేదని దిగ్విజయ్ అన్నారు. అది పెద్ద విషయమే కాదని, కేంద్రం నిర్ణయమే ఫైనలని చెప్పారు. తెలంగాణ విషయంలో కాంగ్రెస్ పార్టీ ఎలాంటి రాజకీయ లబ్ది ఆశించడం లేదని, సమస్య పరిష్కారం కోసమే పార్టీ ప్రయత్నించిందని చెప్పారు.
రేపు సాయంత్రం 4.30 గంటలకు యూపీఏ సమన్యయ కమిటీ సమావేశం ఉంటుందని, దాని తర్వాత మరో గంటసేపట్లో సీడబ్ల్యూసీ భేటీ ఉంటుందని దిగ్విజయ్ సింగ్ ఇవాళ ఉదయం చెప్పిన విషయం తెలిసిందే.

16, జనవరి 2013, బుధవారం

చింతన్.. మంథన్.. అన్నీ.. తెలంగాణమే

చింతన్.. మంథన్.. అన్నీ.. తెలంగాణమే
pranab-గడువులోగా మూడు సందర్భాలు
-18, 19 తేదీల్లో చింతన్ బైఠక్.. 20న ఏఐసీసీ సమావేశం.. 26న రాష్ట్రపతి ప్రసంగం
-రోడ్‌మ్యాప్ ప్రకటించే అవకాశం?.. 20 - 26 మధ్య కేసీఆర్‌తో సంప్రదింపులు?
-అడ్డుకునేందుకు ఆ మూడుపార్టీల ఆఖరి ప్రయత్నాలు

హైదరాబాద్, జనవరి 15 (టీ మీడియా):తెలంగాణ గురించి తేల్చేందుకు తేదీ ప్రకటించిన కాంగ్రెస్ ఇప్పుడు గడువు దగ్గరపడుతున్నకొద్దీ ఆ దిశగా కసరత్తును ముమ్మరం చేస్తోంది. చివరితేదీ జనవరి 28కాగా, ఆలోగా చర్చించేందుకు, నిర్ణయం తీసుకునేందుకు, సంకేతాలో, వివరాలో ప్రకటించేందుకు మూడు సందర్భాలొస్తున్నాయి. ఈ నెల 18, 19 తేదీల్లో రాజస్థాన్‌లోని జైపూర్‌లో కాంగ్రెస్ ‘చింతన్ బైఠక్’ పేర తీవ్ర సమాలోచనలు జరుపనుంది. ఆ మరుసటిరోజు 20వ తేదీన ఏఐసీసీ సమావేశం కానుంది. ఈ రెండు సందర్భాలను తెలంగాణపై చర్చించేందుకు, నిర్ణయం తీసుకునేందుకు వినియోగించుకుంటే, జనవరి 26 రిపబ్లిక్ డే సందర్భంగా రాష్ట్రపతి ప్రసంగంలో అందుకు సంబంధించిన సంకేతాలనో, వివరాలనో వెల్లడించవచ్చని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటికే అన్ని వర్గాలతో, అన్ని రకాలుగా చర్చలు సంప్రదింపులు జరిపిన కాంగ్రెస్ అధిష్ఠానం ఇక ఓ స్పష్టమైన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశముందని, ఆ మేరకు సిద్ధమయిందని కూడా కొన్ని వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

తాజాగా తెలంగాణ ఏర్పాటు దిశగా మరింత సానుకూల సంకేతాలు రావడంతో కాంగ్రెస్ కరాఖండిగా వ్యవహరిస్తుందని అంటున్నాయి. జనవరి 26నాటి రాష్ట్రపతి ప్రసంగంలోనూ తెలంగాణకు సంబంధించి రోడ్‌మ్యాప్ ప్రకటించే అవకాశముందని భావిస్తున్నాయి. ఇంతకాలం ఏదోరకంగా అడ్డుకుని తెలంగాణ ప్రకటనలో జాప్యం జరిగేందుకు కారణమైన పార్టీలు, నేతల్లో తాజా పరిణామాలు తీవ్ర కలవరం కలిగిస్తున్నాయి. ప్రత్యేకించి తెలంగాణ ఏర్పాటును సీమాంవూధకు చెందిన కాంగ్రెస్, టీడీపీ, వైఎస్సార్సీపీ నేతలు కొందరు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇక తెలంగాణ ఖాయమన్న సంకేతాలు వస్తుండటంతో మరోసారి చివరి ప్రయత్నంగా అడ్డుపుల్ల వేసేందుకు సిద్ధమవుతున్నారు. ఢిల్లీకి వెళ్ళి తమ వంతు ప్రయత్నాలు చేయాలనుకుంటున్నారు. తెలంగాణపై గత నెల 28న ఢిల్లీలో జరిపిన అఖిలపక్ష భేటీ అనంతరం రాష్ట్ర విభజన విషయంలో తీవ్ర కసరత్తులు చేసిన కాంగ్రెస్ హైకమాండ్ తెలంగాణ రాష్ట్రం ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చినట్లు హస్తిన వర్గాల సమాచారం. అయితే పార్టీ అంతర్గత సమావేశమైన చింతన్ బైఠక్‌లో ఈ అంశంపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. చింతన్ బైఠక్ పేరిట అఖిల భారత కాంగ్రెస్ కమిటీ నిర్వహిస్తున్న సదస్సులో రాష్ట్ర విభజన అంశం చర్చకు వచ్చే అవకాశాలుంటాయని, అక్కడే తుది నిర్ణయానికి వచ్చే అవకాశం ఉన్నట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది.

మరోవైపు టీఆర్‌ఎస్ అధినేత కే చంద్రశేఖర్‌రావుతో ఈ నెల 26లోగా కాంగ్రెస్ అంతర్గత చర్చలు జరిపే అవకాశం ఉన్నట్లు సమాచారం. కేసీఆర్‌తో చర్చించిన తర్వాతే తెలంగాణపై ప్రకటన జారీచేసే అవకాశాలుంటాయని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఈ నెల 20 నుంచి 26 మధ్య ఈ అంతర్గత చర్చలు ఉండవచ్చని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ప్రత్యేక రాష్ట్రం కోసం ఇప్పటికే టీ కాంగ్రెస్ ఎంపీలు గట్టిగా పట్టుబట్టుతున్నారు. ప్రజల ఆకాంక్షలు, ప్రత్యేక రాష్ట్రం కోసం జరిగిన ప్రాణ త్యాగాల దృష్ట్యా రాష్ట్రాన్ని ఇవ్వాల్సిందేనని టీ కాంగ్రెస్ ఎంపీలు హైకమాండ్‌పై ఒత్తిడి తీసుకొస్తున్నారు. అదేవిధంగా ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రాంత మంత్రుల నుంచి కూడా డిమాండ్ వస్తున్నది. తెలంగాణ ఇవ్వకపోతే ఈ ప్రాంతంలో కాంగ్రెస్‌కు భవిష్యత్తు ఉండబోదని వారంటున్నారు. ఇప్పటికే తెలంగాణలోని పరిస్థితులను వివరిస్తూ, ఇక్కడి వాస్తవాలు, పార్టీ విషయాలు తెలియజేస్తూ హైకమాండ్‌కు వీరు ఒక నివేదిక కూడా అందజేశారు. టీ కాంగ్రెస్ మంత్రులు, ఎంపీలు అనేక మార్లు లేఖలు పంపించారు. రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి గులాం నబీ ఆజాద్ తెలంగాణలో ఉన్న ప్రత్యేక పరిస్థితులపై ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకున్నట్లు తెలిసింది. ప్రత్యేకంగా దూతలను కూడా పంపి రాష్ట్ర విషయాలను తెలుసుకుంటున్నట్లు సమాచారం.

తెలంగాణ ప్రకటించకుంటే ఆంధ్రవూపదేశ్‌లో కాంగ్రెస్ రెంటికి చెడిన రేవడిగా మారుతుందని ఆయన అభివూపాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. సీమాంవూధలో వైఎస్సార్సీపీ ప్రాబల్యం ఉన్నందున రాష్ట్రం సమైక్యంగా ఉన్నా ఆ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి ప్రయోజనం ఉండదని ఆయన భావిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. కాగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ప్రకటిస్తే టీఆర్‌ఎస్ సహకారంతో కాంగ్రెస్ అధిక సీట్లు గెల్చుకుంటుందని రూఢీ అయినట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ హై కమాండ్ ఇప్పటికే కేసీఆర్‌తో మంతనాలు ప్రారంభించినట్లు సమాచారం. త్వరలో ఆయనను హస్తినకు పిలిపించి సంప్రదిస్తారని అంటున్నారు. చింతన్ బైఠక్, ఏఐసీసీ సమావేశం ఈ నెల 20తో ముగిసిన తరువాత 26 వరకు వివిధ దశల్లో చర్చలు కొనసాగుతాయని, ఒక తుది రూపం వస్తుందని సీనియర్ నేత ఒకరు తెలిపారు. యూపీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2004లో రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ప్రసంగంలో ఏకాభివూపాయం ద్వారా తెలంగాణ సాధ్యమని, త్వరలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు దిశగా చర్యలు చేపడతారనే విధంగా ప్రస్తావన వచ్చిందని ఒక నాయకుడు గుర్తు చేశారు. ఆ రకంగానే ఇప్పటివరకు జరిగిన చర్చల ప్రక్రియకు తుదిరూపం ఇచ్చి ఈ నెల 26న ఢిల్లీలో జరిగే రిపబ్లిక్ డే ఉత్సవాల సందర్భంగా రాష్ట్రపతి ప్రసంగంలో కూడా తెలంగాణ రాష్ట్రం అంశం ప్రస్తావనకు తెచ్చే అవకాశం ఉంటుందని టీ కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు.

21, అక్టోబర్ 2012, ఆదివారం

తెలంగాణ ప్రజలకు బతుకమ్మ పండుగ శుబాకాంక్షలు

తెలంగాణ ప్రజలకు బతుకమ్మ పండుగ శుబాకాంక్షలు
 ప్రపంచం  మొత్తం దేవుడిని పువ్వులతో పూజిస్తారు కాని పువ్వులనే దేవుడిగా మలిచి పూజించడం కేవలం మన తెలంగాణలోనే.
          తెలంగాణలో పుట్టినందుకు గర్విద్దాం. 


1, అక్టోబర్ 2012, సోమవారం

ఉక్కుపాదంపై ఎక్కు పెట్టిన జనసాగరం


JANASAGARAM
-అర్ధరాత్రిదాకా నెక్లెస్ రోడ్‌లోనే జనం.. వర్షంతో బురదమయమైన పరిసరాలు
-వాతావరణ ప్రతికూలతతో మార్చ్ విరమణ.. తక్షణ కార్యాచరణ ప్రకటించిన టీ జేఏసీ
-రేపు ఇందిరాపార్క్ వద్ద నిరసన దీక్షలు..త్వరలో టీ జేఏసీ ముఖ్యుల ఆమరణదీక్ష
-మార్చ్ విరమిస్తూ కోదండరాం ప్రకటన.. ఇక టీ మంత్రులే లక్ష్యంగా పోరాటమని వెల్లడి
-ఉద్యమం విజయం సాధించిందన్న మల్లేపల్లి
-‘మార్చ్’పై పోలీసుల కిరాతకం
-జనంపై యథేచ్ఛగా లాఠీచార్జి
-విచ్చలవిడిగా బాష్పవాయు ప్రయోగం
-పోలీసుల కిరాతకానికి ప్రతీకలుగా మారిన ఖైరతాబాద్,సచివాలయం, క్లాక్‌టవర్, పీపుల్స్‌ప్లాజా
- రెచ్చగొట్టి.. ఆపై తలలు పగులగొట్టి..
- ఉదయం నుంచి కొనసాగిన దమనకాండ
-రణరంగమైన ఉస్మానియా క్యాంపస్
-గంటలో 50 బాష్పవాయు గోళాలు
-సచివాలయం వద్దా టియర్‌గ్యాస్ ప్రయోగం
- పీపుల్స్‌ప్లాజా వద్ద గాల్లోకి కాల్పులు
-ఎంపీ విజయశాంతిని అడ్డుకున్న పోలీసులు
-ఎమ్మెల్యే విష్ణువర్ధన్‌రెడ్డి అరెస్టు .. జీవ వైవిధ్య సదస్సును అడ్డుకోవాలని ఎమ్మెల్యే పిలుపు
-పోలీసుల దాడులతో రెచ్చిపోయిన ఆందోళనకారులు
-నెక్లెస్ రోడ్డులో రెండు వాహనాల దహనం
-జలవిహార్‌కు నిప్పు.. నెక్లెస్‌రోడ్డు రైల్వే స్టేషన్‌పై దాడి
-జోరువానలోనూ సడలని సంకల్పం
-ఖాళీ చేయించేందుకు ఖాకీల కుతంత్రం
- వేదికపైకీ బాష్పవాయుగోళాల ప్రయోగం
-వాటర్ కేనన్‌లతో చెదరగొట్టే యత్నం
-మార్చ్ ప్రత్యక్ష ప్రసారాల నిలిపివేత


తుపాకి రాజ్యంలో.. తూటాల రాజ్యంలో సాగర తీరాన తెలంగాణ హోరుగాలులు వీచాయి! జనం జనం.. ప్రభంజనం! ఇసుకేస్తేరాలనంత! వందల్లో మొదలై.. వేలకు చేరి.. లక్షలుగా మారిన జనం! తెలంగాణ పది జిల్లాల నుంచి వచ్చి.. హుస్సేన్‌సాగర్ తీరాన పోరు కెరటాలై పొంగి.. తిరగబడ్డారు! పొద్దున్న మొదలుకుని.. రాత్రి 12 గంటల దాకా.. జోరువానలో సైతం నిలబడి నినాదాలు చేశారు! మా రాష్ట్రం మాకివ్వండంటూ నగరం నడిబొడ్డున నెక్లెస్‌రోడ్డు సాక్షిగా.. దిక్కులు పిక్కటిల్లేలా పొలికేక వేశారు! ఆ లక్షల పొలికేకలు ఒక్కగొంతుకై.. తెలంగాణం గర్జించింది! పోరు తెలంగాణ బిడ్డలు గాండ్రించారు! సమరశంఖాలు పూరించారు! నిలువెల్లా వివక్షల పుట్టలు పెంచుకున్న వలసపాలకుల దౌర్జన్య రాజ్యాన్ని ధ్వంసం చేస్తామని ప్రతినపూనారు! తలలు పగిలినా.. కాళ్లు చేతులు విరిగినా.. ఒంటిపై లాఠీ దెబ్బలు తెట్టుతేలినా చలించక నిలిచారు.. తెలంగాణ ప్రకటన వచ్చేదాకా తెగించి కొట్లాడుతమని తెగేసి చెప్పారు! నెక్లెస్‌రోడ్డులో ‘సాగర హారాన్ని’ తళుకులీనించారు! మధ్యాహ్నం నుంచి మార్చ్ మొదలవుతుందని ప్రకటించినా.. పొద్దున నుంచే సంకలో సద్దితో.. చేతిలో జెండాతో నగరానికి తరలి వచ్చింది తెలంగాణ ప్రజ! ఒకవైపు నెక్లెస్‌రోడ్డులో మార్చ్ నిర్వహణకు అనుమతించిన పాలకులు.. ఆ మార్చ్‌లో విలీనమయ్యేందుకు బయల్దేరిన సబ్బండవర్ణాల సమూహాలను నిర్దాక్షిణ్యంగా అణిచివేసేందుకు వీలున్న అన్నిమార్గాల్లో ప్రయత్నించారు. 

మార్చ్‌కు ఎటు వెళ్లాలో తెలియనివారిని ఒకసారి అటు పొమ్మని.. మరోసారి ఇటు రమ్మని చెప్పి, పథకం ప్రకారం దారిమళ్లిస్తూ.. ఓ మూలకు నెట్టి లాఠీలకు పనిచెప్పారు. లెక్కకు మిక్కిలి బాష్పవాయు గోళాలు పొగలు చిమ్మినా.. రబ్బర్ బుల్లెట్లు ఒంటినిండా తాకుతున్నా.. లాఠీలు విరుగుతున్నా.. ఉద్యమకారుల సంకల్పం సడల్లేదు! ఉదయాన్నే పాలకుల తీరు అర్థమైపోయింది. ఉస్మానియా వద్ద విద్యార్థులను మార్చ్‌కు రానీయకుండా అడ్డుకోవటంతో అక్కడ పెద్ద సమరమే జరిగింది! వందల సంఖ్యలో టియర్‌గ్యాస్ ప్రయోగాలతో ఉస్మానియా ప్రాంగణం దట్టమైన పొగలతో రణరంగాన్ని తలపించింది! తదుపరి సికింవూదాబాద్ క్లాక్‌టవర్ వద్ద.. ఖైరతాబాద్ ఫ్లైవోవర్ దగ్గర, సచివాలయం ఫ్లైవోవర్ వద్ద, బుద్ధభవన్ సమీపంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి.. మార్చ్‌కు వెళ్లే ప్రజలను అడ్డుకునేందుకు విఫలయత్నాలు చేశారు. అటు జిల్లాల నుంచి బయల్దేరిన ప్రదర్శకులను పోలీసులు ఎక్కడికక్కడ నిలిపివేసి, వెనక్కు పంపేశారు.

అరెస్టులు, నిర్బంధకాండలు ఉండబోవని హామీ ఇచ్చిన ప్రభుత్వం మాట తప్పిందని ప్రొఫెసర్ కోదండరాం ఉదయమే మండిపడ్డారు. ఈ సమయంలోనే అరెస్టులను నిరసిస్తూ టీ కాంగ్రెస్ ఎంపీలు సీఎం క్యాంపు కార్యాలయం వద్ద ధర్నాకు దిగడంతో పోలీసుల వారినీ అరెస్టు చేసి, అక్కడి నుంచి తరలించారు. మరోవైపు టీడీపీ టీ ఫోరం ఎమ్మెల్యేలు అసెంబ్లీ వద్ద అరెస్టయ్యారు. ఈ పరిణామాల మధ్యే తెలంగాణ మార్చ్ హుస్సేన్ సాగర్ తీరాన నెక్లెస్‌రోడ్డుపై మొదలైంది. వివిధ ప్రాంతాల నుంచి సకల జేఏసీలు, తెలంగాణ సంఘాలు, వేదికలు, రాజకీయ పార్టీలు, వారి వారి నాయకులు, ఎమ్మెల్యేల నేతృత్వాన నెక్లెస్‌రోడ్ దిశగా కదిలాయి. వివిధ కళా బృందాల ఆటపాటలతో ఆ ప్రాంతం ఉత్సవ వాతావరణాన్ని తలపించింది. నేతల ఉపన్యాసాలు స్ఫూర్తినిచ్చేలా సాగాయి. కానీ, పోలీసు కవ్వింపు చర్యలు సాయంవూతానికి పరిస్థితిని మార్చివేశాయి. మార్చ్‌కు బయల్దేరినవారిపై ఎక్కడికక్కడ ప్రతాపం చూపిన ఖాకీలు.. మార్చ్‌వేదిక వద్ద సైతం ఓవర్ యాక్షన్ చేశారు! ఉద్యమకారులను కవ్వించే చర్యలకు పాల్పడ్డారు. ఈ క్రమంలోనే పీపుల్స్‌ప్లాజా వద్ద పోలీసులు గాలిలోకి కాల్పులు జరిపి, ఉద్యమక్షిశేణులను బెదిరించే ప్రయత్నం చేశారు.

అయినా వెరవని శ్రేణులు.. బారికేడ్లు తోసుకుంటూ ముందుకు కదలి మార్చ్‌వేదిక వద్దకు చేరుకున్నారు. ఓ దశలో పలు వాహనాలు దగ్ధమయ్యాయి. అయితే, ఇది మార్చ్‌ను పక్కదారిపట్టించేందుకు, కవ్వించేందుకు పోలీసులు చేసిన పని అన్న అనుమానాన్ని కోదండరాం వ్యక్తం చేశారు. పోలీసు చర్యలకు నిరసనగా రాత్రంతా ఇక్కడే ఉండబోతున్నట్లు మార్చ్‌కు హాజరైన ప్రజల అభీష్టం మేరకు ప్రకటన చేశారు. సాయంత్రం ఆరున్నర తర్వాత పోలీసులు మరోసారి కపట పన్నాగాలు వేశారు. ఏడు గంటల వరకే మార్చ్‌కు అనుమతి ఉన్న సాంకేతిక అంశాన్ని పట్టుకుని.. నెక్లెస్‌రోడ్డును క్లియర్ చేసేందుకు సిద్ధమయ్యారు. ఇందుకోసం ఏకంగా వేదికమీదకే బాష్పవాయుగోళాలు ప్రయోగించారు. వీటి ప్రభావంతో వేదికపై ఉన్న నేతలు పలువురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మరోవైపు వాటర్ కెనాన్లను ఉపయోగించి ఉద్యమకారులను చెదరగొ తీవ్రంగా ప్రయత్నించారు. అయితే, వాటిని ఉద్యమకారులు తీవ్రంగా ప్రతిఘటించడంతో అవి తోకముడిచాయి. ఈ సమయంలోనే జోరుగా వాన పడినా ప్రజలు కదల్లేదు. చివరికి ఉద్యమక్షిశేణుల పట్టుదల ముందు పోలీసులు వ్యూహాత్మకంగా వెనక్కుతగ్గినట్లు కనిపించింది. తెల్లారితే నగరంలో అంతర్జాతీయ జీవ వైవిధ్య సదస్సు ఉన్న కారణంగా ఎట్టిపరిస్థితుల్లోనూ తెల్లవారే సరికి నెక్లెస్‌రోడ్డు నుంచి ఉద్యమకారులను తరిమివేయాలని తీర్మానించుకున్న పోలీసులు.. బాగాపొద్దుపోయిన తర్వాత మంతనాల్లో మునిగిపోయారు. హోం మంత్రి సబితా ఇంద్రాడ్డి, డీజీపీ దినేష్‌డ్డితో సీఎం కిరణ్‌కుమార్ చర్చించారు. బలవంతంగా పంపేసేట్లయితే ఏ రూట్‌లో పంపాలి.. ఆ రూట్‌లో ఉద్యమకారులు విధ్వంసానికి పాల్పడే అవకాశాలేమైనా ఉన్నాయా? అనే కోణంలోనూ చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. అయితే, వారికి ఆ అవకాశం ఇవ్వకుండా టీజేఏసీ తెలంగాణ మార్చ్‌ను విరమిస్తున్నట్లు ప్రకటించింది. 

జోరుగా కురుస్తున్న వర్షంతో, వేదిక పరిసరాలు పూర్తిగా బురదమయం అయిపోయి.. కదలటానికే వీల్లేని పరిస్థితులు ఉన్న కారణంగా తెలంగాణ మార్చ్‌ను విరమిస్తున్నట్లు టీజేఏసీ నాయకత్వం ప్రకటించింది. చాతనైనంత వరకూ ఇక్కడే ఉందామని అనుకున్నామని, అయితే వాతావరణ పరిస్థితులు సహకరించని పరిస్థితుల్లో మార్చ్‌ను విరమిస్తున్నామని కోదండరాం రాత్రి 11.50 గంటల సమయంలో ప్రకటించారు. దీనికి కొనసాగింపుగా అక్టోబర్ 2వ తేదీన ఇందిరాపార్క్ వద్ద దీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. త్వరలోనే టీజేఏసీ ముఖ్య నాయకత్వం ఆమరణ నిరశనకు కూర్చుంటుందని చెప్పారు.

kodandaram_01
నిర్బంధాలను అధిగమించి.. సాగర హారం గ్రాండ్ సక్సెస్
-జోరువానలోనూ సడలని సంకల్పం
-దిక్కులు పిక్కటిల్లిన హైదరాబాద్
-జన సాగరమైన నెక్లెస్‌రోడ్
-ఐదు లక్షల మంది హాజరు!
-జిల్లాల నుంచి పోటెత్తిన జనం
-‘మార్చ్’పై పోలీసుల కిరాతకం
-రణరంగమైన ఉస్మానియా క్యాంపస్
-పోలీసుల కిరాతకానికి ప్రతీకలుగా మారిన ఖైరతాబాద్, సచివాలయం, క్లాక్‌టవర్, పీపుల్స్‌ప్లాజా
- అరగంటలో 50 బాష్పవాయు గోళాలు
- పీపుల్స్‌ప్లాజా వద్ద గాల్లోకి కాల్పులు
- ఎంపీ విజయశాంతిని అడ్డుకున్న పోలీసులు
- ఎమ్మెల్యే విష్ణువర్ధన్‌డ్డి అరెస్టు
- పోలీసుల దాడులతో రెచ్చిపోయిన ఆందోళనకారులు
- నెక్లెస్ రోడ్డులో రెండు వాహనాలు దగ్ధం
- జలవిహార్‌కు నిప్పు.. నెక్లెస్‌రోడ్డు రైల్వే స్టేషన్‌పై దాడి
- మార్చ్ వేదికపైకీ బాష్పవాయువు గోళాల ప్రయోగం
- మార్చ్ ప్రత్యక్ష ప్రసారాల నిలిపివేత

T_march_kavithaహైదరాబాద్, సెప్టెంబరు 30 (టీ మీడియా):ఉదయం ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థుల ర్యాలీని అడ్డుకోవటంతో మొదలైన పోలీసు నిర్బంధకాండ.. అనంతరం ఖైరతాబాద్, తెలుగుతల్లి ఫ్లైవోవర్, సికింవూదాబాద్ క్లాక్‌టవర్ సహా అనేక ప్రాంతాల్లో కొనసాగింది. శాంతియుత వాతావరణంలో జై తెలంగాణ అంటూ ర్యాలీగా బయలుదేరి హైదరాబాద్‌లోని నెక్లెస్‌రోడ్డుకు వస్తున్న ఉద్యమకారులపై పోలీసులు అకారణంగా లాఠీలు ఝళిపించారు. బాష్పవాయు గోళాలు ప్రయోగించారు. మహిళలు, వృద్ధులు అని చూడకుండా తమ దాష్టీకాన్ని ప్రదర్శించారు. పదుల సంఖ్యలో ఉద్యమకారుల తలలు పగిలాయి. అనేక మందికి కాళ్లు, చేతులు విరిగాయి. అయినా లెక్క చేయని తెలంగాణ ఉద్యమకారులు ముందుకే సాగారు. మరోవైపు ఉదయం నుంచి ఉస్మానియా క్యాంపస్ వద్ద భారీ ఎత్తున బలగాలను మోహరించి, విద్యార్థులు కవాతులో పాల్గొనకుండా అడ్డుకున్నారు. ఎన్‌సీసీ గేటు వరకు ర్యాలీగా వచ్చిన విద్యార్థులను చెదరగొట్టేందుకు పోలీసులు తీవ్రస్థాయిలో బాష్పవాయు గోళాలు ప్రయోగించారు. 30 నిమిషాల వ్యవధిలో 50 బాష్పవాయుగోళాలను ప్రయోగించారంటే ఓయూ వద్ద పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. మరోవైపు క్లాక్ టవర్, ఖైరతాబాద్, సచివాలయం, తెలుగుతల్లి ఫ్లైవోవర్, పీపుల్స్‌ప్లాజా... ఇలా ఎక్కడపడితే అక్కడ కవాతుకు వచ్చే ఉద్యమకారులపై పోలీసులు విరుచుకుపడ్డారు.

ఒక దశలో పీపుల్స్ ప్లాజా వద్ద పోలీసులు గాలిలోకికాల్పులు జరిపి ఉద్యమక్షిశేణులను బెదిరించారు. దీనికి అంతేదీటుగా స్పందించిన తెలంగణ జనం.. రెండు పోలీసు వాహనాలకు నిప్పు పెట్టారు. వీటన్నింటినీ అధిగమించిన ఉద్యమక్షిశేణులు రాజకీయ జేఏసీ, టీఆర్‌ఎస్, బీజేపీ, సీపీఐ, న్యూడెమోక్షికసీ, తెలంగాణ యునైటెడ్‌వూఫంట్, పీవోడబ్ల్యూ, తెలంగాణ నగార సమితి సహా పలు ఉద్యోగ సంఘాలు, ప్రజా సంఘాలు, సాంస్కృతిక వేదికల నేతృత్వంలో వేలు లక్షలుగా నెక్లెస్ రోడ్డుకు చేరుకున్నారు. 

దద్దరిల్లిన సచివాలయ ప్రాంగణం
సచివాలయం, బుద్ధభవన్ వద్ద న్యూడెమోక్షికసీ కార్యకర్తలు బారికేడ్లను ధ్వంసం చేసేందుకు ప్రయత్నించడంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు ఉద్యమకారులను అడ్డుకుని, బాష్పవాయువును ప్రయోగించారు. గాయపడినవారిని పలువురు ఆస్పవూతులకు తరలించారు. మీడియాపైనా పోలీసులు టియర్‌గ్యాస్ ప్రయోగించారు.

అడుగడుగునా ఆటంకాలే
మార్చ్ వేదికైన నెక్లెస్‌రోడ్డుకు సచివాలయం మీదుగా వెళ్లేందుకు జనం ప్రయత్నించగా పోలీసులు అనుమతించలేదు. రవీంవూదభారతి, అసెంబ్లీ, లిబర్టీ చౌరస్తా వైపు నుంచి వస్తున్న ప్రజలను పోలీసులు అడ్డుకున్నారు. సచివాలయాన్ని ముట్టడించడానికి వస్తున్నట్లుగా పోలీసులు భావించి లాఠీచార్జి చేశారని వారు ఆరోపించారు. మార్చ్‌కు ర్యాలీగా వస్తున్న విద్యుత్ ఉద్యోగ జేఏసీ కార్యకర్తలను ఖైరతాబాద్ చౌరస్తాలో పోలీసులు అడ్డుకుని, లాఠీచార్జి చేశారు. తెలంగాణవాదులను అరె స్టు చేయడం ఆపకపోతే సోమవారం తెలంగాణలో బస్సు సర్వీసులను నిలిపి వేస్తా మని ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్ యూనియన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. నాంపల్లి నుంచి బయల్దేరిన తెలంగాణ యూనైటెడ్ ఫ్రంట్ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. టఫ్ నేత, ఎమ్మెల్సీ దిలీప్‌కుమార్‌ను పోలీసులు అరెస్టు చేశారు. రాష్ట్రంలో గవర్నర్ పాలన కొనసాగుతోందని కాంగ్రెస్ ఎంపీ మధుయాష్కి విమర్శించారు. 

ర్యాలీగా బయలుదేరిన నేతలు... 
ఇందిరా పార్కు నుంచి బయల్దేరిన ర్యాలీలో బీజేపీ నేతలు కిషన్‌డ్డి, దత్తావూతేయ, ఇంద్రసేనాడ్డి, ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. తెలంగాణ మార్చ్ సందర్భంగా ప్రభుత్వం అనుసరించిన వైఖరిని కిషన్‌డ్డి ఖండించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ, ఎమ్మెల్యేలు జీ మల్లేష్, కూనంనేని సాంబశివరావు, చంద్రావతి తదితరుల నేతృత్వంలో కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ర్యాలీగా బయలుదేరి కిమ్స్ ఆస్పత్రి మీదుగా నెక్లెస్ రోడ్డుకు చేరుకున్నారు. క్లాక్ టవర్ నుంచి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ర్యాలీగా బయలుదేరారు. జలసౌధ నుంచి తెలంగాణ రిటైర్డ్ ఇంజినీర్లు, తెలంగాణ ఉద్యోగుల సంఘం, బస్‌భవన్ నుంచి ఆర్టీసీ జేఏసీ, ఎన్‌ఎంయూ కార్యకర్తలు ర్యాలీగా బయలుదేరి వెళ్లారు. గన్‌పార్క్ నుంచి ఉపాధ్యాయ, ప్రజా సంఘాలు, తెలంగాణ జర్నలిస్టు ఫోరం కన్వీనర్ అల్లం నారాయణ నేతృత్వంలో తెలంగాణ జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో తెలంగాణ మార్చ్‌కు బయలుదేరారు.టీఆర్‌ఎస్ ఎంపీ విజయశాంతిని ఖైరతాబాద్ చౌరస్తా వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ఆమె ప్రతిఘటించడంతో తోపులాట జరిగింది. అంతకు ముందు టీడీపీ టీ ఎమ్మెల్యేలు గన్‌ఫౌండ్రీ నుంచి అసెంబ్లీలోని టీడీఎల్పీ కార్యాలయానికి వెళ్లేందుకు ప్రయత్నించగా, అసెంబ్లీ ప్రాంగణంలోకి పోలీసులు ఎవ్వరినీ అనుమతించలేదు. దీంతో నిరసనగా టీడీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ ఎదుట రోడ్డుపై బైఠాయించడంతో, పోలీసులు అరెస్టు చేశారు. మార్చ్‌కు ర్యాలీగా వస్తున్న ఎమ్మెల్యే విష్ణువర్ధన్‌డ్డిని పోలీసులు ఖైరతాబాద్ వద్ద అదుపులోకి తీసుకున్నారు. 

సీఎం క్యాంపు కార్యాలయం ఎదుట ఎంపీల ధర్నా...
కవాతులో పాల్గొనేందుకు వస్తున్న నేతలను పోలీసులు అడ్డుకోవడంపై తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా మధుయాష్కి, వివేక్, పొన్నం ప్రభాకర్, గుత్తా సుఖేందర్‌డ్డి, రాజయ్య ఎంపీలు సీఎం క్యాంపు కార్యాలయం వద్ద ధర్నాకు ప్రయత్నించగా, పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కిరణ్ సీమాంధ్ర ప్రాంతానికి సీఎంగా వ్యవహరిస్తున్నారని ఎంపీ పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. తెలంగాణ మార్చ్‌కు అనుమతిచ్చిన రాష్ట్ర ప్రభుత్వం మాట తప్పిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ విమర్శించారు. 

రాజీనామాలకు వెనుకంజ వేయం: దామోదర
తెలంగాణ కోసం రాజీనామాలకు కూడా సిద్ధమని డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ ప్రకటించారు. ‘‘మార్చ్ సందర్భంగా ఎక్కడైనా తెలంగాణ ప్రజానీకానికి ఏం జరిగినా, ఉద్యమాన్ని రెచ్చగొట్టే విధంగా పోలీసులు ప్రవర్తించినా జానాడ్డి చెప్పినట్లు రాజీనామాకు సిద్ధం. ఈసారి రాజీనామాలకు వెనుకంజ వేసేది లేదు’’ అని ఆయన స్పష్టం చేశారు. కవాతుకు వచ్చే వారిని అరెస్టు చేయడం దురదృష్టకరమని ఎమ్మెల్యే భిక్షమయ్య గౌడ్ అన్నారు. పోలీసుల తీరుపై అధిష్ఠానానికి ఫిర్యాదు చేస్తానని ఎంపీ జగన్నాథం తెలిపారు. ప్రభుత్వం, ముఖ్యమంత్రి అనుసరిస్తున్న చర్యలను ఎంపీ రాపోలు ఆనందభాస్కర్ తీవ్రంగా ఖండించారు. 

సీఎం తన తెలివిని అరెస్టుల కోసం వాడొద్దు : కేకే 
అధికార పార్టీ ఎంపీలను అరెస్టు చేయడం అప్రజాస్వామికమైన చర్య అని మాజీ ఎంపీ, సీనియర్ కాంగ్రెస్ నేత కే కేశవరావు మండిపడ్డారు. ముఖ్యమంవూతిని కలిసేందుకు వెళితే అనుమతించకపోవడం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామని చెప్పారు. ఆయన తెలివి తేటలను అరెస్టుల కోసం వాడకూడదని హితవు పలికారు.

దశాబ్దాల వివక్ష.. అణచివేతలను ఎదుర్కొంటున్న తెలంగాణ.. తన గోస చెప్పుకునేందుకు తలపెట్టిన తెలంగాణమార్చ్‌లోనూ అదే వివక్షలు, అణచివేతలు ఎదుర్కొన్నది. ప్రశాంతంగా మొదలైన సాగరహారం.. పోలీసుల అత్యుత్సాహం, మితిమీరిన జోక్యంతో రణరంగమైంది. మార్చ్‌కు అనుమతించిన మరుక్షణం నుంచే కుటిల పన్నాగాలు రచించిన రాష్ట్ర ప్రభుత్వం.. మార్చ్ ముందు రోజు మరింత తెగించింది. హైదరాబాద్‌కు ఉద్యమకారుల రాకను అడ్డుకుంది. రైళ్లు, బస్సులు రద్దు చేసింది. ప్రైవేటు వాహనాలు కిరాయికి ఇవ్వకుండా వాటి యజమానులను బెదిరించింది. మార్చ్ జరిగే ఆదివారం సీమాంధ్ర పాలకుల దమననీతి పరాకాష్టకు చేరుకుంది. అన్నిరకాల నిర్బంధాలను ఎదుర్కొని హైదరాబాద్‌లో అడుగు పెట్టిన ఉద్యమకారులకు ఇక్కడా అడుగడుగునా పోలీసుల నుంచి అవాంతరాలు ఎదురయ్యాయి. పెద్ద సంఖ్యలో బాష్పవాయు గోళాలు ఉద్యమకారులను చెదరగొ విఫలయత్నం చేశాయి. కానీ.. ఎక్కడా తెలంగాణ శ్రేణులు తమ పట్టుదలను కోల్పోలేదు. నెక్లెస్‌రోడ్ వేదికగా జరిగిన మార్చ్‌ను దాదాపు ఐదు లక్షల మంది పోటెత్తించారు. తెలంగాణ పోరు సత్తాను ప్రపంచానికి చాటి చెప్పారు. తమ ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష ఎంతటి బలమైనదో చూపించారు. జోరున వాన కురుస్తున్నా చలించక.. రెట్టించిన ఉత్సాహంతో జై తెలంగాణ నినాదాలు చేశారు.

వేదిక లక్ష్యంగా బాష్పవాయుగోళాలు
రాత్రి ఏడు గంటల సమయం సమీపిస్తు న్న నేపథ్యంలో పోలీసులు మరోసారి దుం దు డుకు చర్యలకు పాల్పడ్డారు. కూకట్‌పల్లి నాలా బ్రిడ్జి నుంచి వేదికపైన, సమీపంలోపడేలా టియర్‌గ్యాస్ ప్రయోగించారు. అదే సమయం లో వాటర్‌కెనాన్‌లను రంగంలోకి దింపారు. ఈ పరిణామాలకు ముందే టీ మా ర్చ్ లైవ్ కవరేజీని పాలకులు అడ్డుకుని నిలిపివేశారు. వేదిక సమీపంలో ఏం జరుగుతున్న దో తెలియనీయకుండా పోలీసులు జాగ్రత్తపడ్డారు. ఒకవైపు హోం మంత్రి సబితా ఇంద్రాడ్డి పోలీసులు సంయమనం పాటించాలని విజ్ఞప్తులు చేస్తున్న సమయంలోనే అవేవీ పట్టనట్లు రెచ్చిపోయారు. ఈ సమయంలో మా ర్చ్‌కు హాజరైన పలువురు ఎమ్మెల్యేలు ‘‘మీరు భయపడకండి. ఇక్కడి నుంచి ఎవరూ కదలొద్దు. మీ ప్రాణాలకు మా ప్రాణాలు అడ్డం వేస్తాం. పోలీసులుటియర్ గ్యాస్ ప్రయోగిస్తే ముందు వరుసలో మేమే ఉంటాం’’ అని శ్రేణులకు భరోసా ఇచ్చారు. ఓవైపు వేదికపై ప్రసంగాలు కొనసాగుతుండగానే టియర్‌గ్యాస్ ప్రయోగం జరగడంతో కోమటిడ్డి వెంకట్‌డ్డి సహా పలువురు ఎమ్మెల్యేలు తీవ్ర అస్వస్థతకు గురయ్యా రు. అస్వస్థతకు గురైన వారికి తెలంగాణవైద్యు లు హెల్త్ క్యాంపులో చికిత్స 

courtesy:Namasthe telangaana.com

26, సెప్టెంబర్ 2012, బుధవారం

ఇది విహార యాత్ర కాదు ..తెలంగాణ తల్లి విముక్తి యాత్ర


పోలీసులు అనుమతి ఇచ్చినా ఇవ్వకున్నా ఈ నెల 30న తెలంగాణ మార్చ్ జరిగి తీరుతుందని టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం తేల్చిచెప్పారు. మార్చ్ ఎప్పుడు ముగుస్తుందనేది ఆరోజే తేలుస్తామని తెలిపారు. మంగళవారం ఆయన హైదరాబాద్‌లో వేర్వేరు కార్యక్షికమాల్లో పాల్గొని ప్రసంగించారు. మార్చ్ జరిగే విషయంలో ఎలాంటి శషభిషలు లేవని స్పష్టం చేశారు. తెలంగాణతల్లిని విముక్తి చేసేందుకే మార్చ్ చేపట్టామని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వం అనుమతించాలేగానీ.. కోటి మంది వచ్చేందుకూ సిద్ధమని ప్రకటించారు. తాము ఒట్టిగా లేమని, ఉపాయంతో ఉద్యమాన్ని నడుపుతున్నామని చెప్పారు. తమ వద్ద చాలా అస్త్రాలు ఉన్నాయని, చివరిలో బ్రహ్మాస్త్రాన్ని తీస్తామని కోదండరాం వెల్లడించారు. కలిసిరాని పార్టీలను మట్టికరిపిస్తామని అన్నారు. మంత్రులకు పదవులు, అధికారంమీద యావే తప్ప ప్రజా ఆకాంక్షలపై శ్రద్ధ లేదని కోదండరాం విమర్శించారు.

‘‘మూడు నెలల క్రితం మార్చ్ ప్రకటన చేస్తే ఇప్పుడు వాయిదా వేసుకోమంటున్నారు. మాది విహార యాత్ర కాదు.. ఇది తెలంగాణ కోసం చేసే మార్చ్. తెలంగాణ ఏర్పాటు డిమాండ్‌ను తీర్చితే మార్చ్‌ను ఆపే ఆలోచన చేస్తాం’’ అని విస్పష్టంగా చెప్పారు. అమెరికాలో నల్లజాతీయులు శ్వేతజాతీయులకు ఐడీ కార్డు చూపినట్లుగా ఇక్కడ తెలంగాణ వారి పరిస్థితి ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వెయ్యి మంది చనిపోయినా స్పందించని ప్రభుత్వాన్ని ఇక్కడే చూస్తున్నామని చెప్పారు. మార్చ్‌కు అనుమతి ఇస్తే మీడియా రక్షణ బాధ్యత తామే తీసుకుంటామన్నారు.

లేకుంటే ప్రభుత్వం తీసుకోవాలన్నారు. తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టుల పాత్ర మరువలేనిదని, అదే సమయంలో కొన్ని మీడియా సంస్థలు పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నాయన్నది వాస్తవమని కోదండరాం చెప్పారు. ‘‘మనం కొట్లాడేది సీమాంధ్ర పాలకులు, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలతోనే.. సీమాంధ్ర ప్రజలతో కాదు’’ అని అన్నారు. హైదరాబాద్‌లోని సెటిలర్లు అభవూదతాభావానికి గురికావాల్సిన అవసరం లేదని ఆయన నొక్కి చెప్పారు. తెలంగాణ ఉద్యమం 11 ఏళ్లుగా సాగుతున్నప్పటికీ సహనం కోల్పోతే తెలంగాణ ప్రజలే ప్రాణత్యాగాలు చేసుకున్నారేగానీ.. ఏనాడూ ఎవరిపైనా దాడులకు పాల్పడలేదని అన్నారు. తెలంగాణ ప్రజలకు ప్రేమ, దయాగుణం ఉంటుందని చెప్పారు. రాష్ట్రం కోసం పోరాటం చేస్తే వచ్చే ఫలితంలో ఇక్కడి సీమాంవూధులకూ భాగస్వామ్యం ఉంటుందని, కనుక అందరం కలిసి తెలంగాణ సాధించుకుందామన్నారు